Rashmika Mandanna: నయనతార తర్వాత రష్మిక మందన్నకే ఇది సాధ్యం..!

| Edited By: Janardhan Veluru

Dec 09, 2024 | 6:36 PM

కొద్ది రోజులుగా నేషనల్ లెవల్‌ లో రష్మిక మందన్న (Rashmika Mandanna) పేరు మార్మోగిపోతోంది. సౌత్ సినిమాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక మందన్న.. బాలీవుడ్‌ లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. నార్త్‌ లోనూ డిఫరెంట్ మూవీస్‌తో జర్నీ స్టార్ట్స్ చేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్‌ గా మారారు. పుష్ప 2 (Pushpa 2)తో రష్మిక క్రేజ్ పీక్‌కు చేరింది.

Rashmika Mandanna: నయనతార తర్వాత రష్మిక మందన్నకే ఇది సాధ్యం..!
Rashmika Mandanna, Nayanthara
Follow us on

సాధారణంగా హీరోయిన్స్ ఏ జానర్‌ కి ఆ జానర్‌ సపరేట్‌ గా ఉంటారు. కొంత మంది గ్లామర్ రోల్స్ చేస్తే.. ఇంకొందరు బోల్డ్ ఇమేజ్‌ తో పాపులర్ అవుతారు.. మరికొంత మంది కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌ రోల్స్ చేస్తారు.  ఇంకొంత మంది లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్స్ అయిపోతారు. కానీ ఈ అన్ని జానర్లు కవర్ చేసే బ్యూటీస్ వెండితెర మీద చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన నటిగా పేరు తెచ్చుకుంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.

కొద్ది రోజులుగా నేషనల్ లెవల్‌ లో రష్మిక మందన్న పేరు తెగ వైరల్ అవుతోంది. సౌత్ సినిమాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక మందన్న.. బాలీవుడ్‌ లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. నార్త్‌ లోనూ డిఫరెంట్ మూవీస్‌తో జర్నీ స్టార్ట్స్ చేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్‌ గా మారారు. ముఖ్యంగా యానిమల్ సక్సెస్‌ రష్మిక ఇమేజ్‌ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో రెగ్యులర్‌ కమర్షియల్ హీరోయిన్‌ రోల్‌ లో కనిపిస్తూనే బోల్డ్ సీన్స్‌ లోనూ అదరగొట్టారు. అదే సమయంలో బెస్ట్ పర్ఫామర్మ్‌ గానూ ఆకట్టుకున్నారు.

ఆల్రెడీ నటిగా మంచి పేరు రావటంతో ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు రష్మిక. సాధారణంగా హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగు వేస్తే ఇక కమర్షియల్ సినిమాలకు దూరమవుతారు. కానీ రష్మిక మాత్రం ఆ రూల్‌ ను బ్రేక్ చేశారు. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగు వేస్తున్నారు. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇన్నాళ్లు ఇలా కమర్షియల్ సినిమాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న వన్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ నయనతార మాత్రమే. ఇప్పుడు రష్మిక కూడా ఇదే లిస్ట్‌ లో చేరారు. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌ గా బిజీగా ఉంటూనే లేడీ ఓరియటెండ్ మూవీస్‌ కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో ఛాలెంజింగ్ రోల్స్‌, బోల్డ్ క్యారెక్టర్స్‌ తో నేషనల్ లెవల్‌ లో సెన్సేషన్‌ గా మారుతున్నారు. వరుసగా డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తూ దూసుకుపోతున్న రష్మిక మందన్న న్యూస్‌ హెడ్‌ లైన్స్‌ లో ఫ్లాష్ అవుతున్నారు.

Rashmika Mandanna In Pushpa 2

పుష్ప 2 రిలీజ్ తరువాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో  మాస్‌, బోల్డ్‌ పర్ఫామెన్స్‌ తో పాటు ఎమోషనల్ సీన్స్‌ లోనూ అదరగొట్టారు రష్మిక మందన్న. దీంతో ఎక్స్‌ పరిమెంటల్‌ రోల్స్‌ కు బెస్ట్ ఛాయిస్‌ గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఇదే జోరులో నేషనల్‌ క్రష్‌ నార్త్‌ లోనూ ప్రయోగాలు చేస్తారేమో చూడాలి.