Major Movie Update: మేజర్‌ సందీప్ జయంతిన ‘మేజర్‌’ అప్‌డేట్‌.. ట్రైలర్‌ విడుదల చేస్తారా..?

Major Movie Update: 2006 నవంబర్‌ 26న మంబయి నగరంలో జరిగిన మారణ హోహం యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్‌ నుంచి సముద్ర మార్గంలో ముంబయికి వచ్చిన కొంత మంది ఉగ్రవాదులు సృష్టించిన..

Major Movie Update: మేజర్‌ సందీప్ జయంతిన మేజర్‌ అప్‌డేట్‌.. ట్రైలర్‌ విడుదల చేస్తారా..?
Major Update 15

Updated on: Mar 15, 2021 | 4:20 AM

Major Movie Update: 2006 నవంబర్‌ 26న మంబయి నగరంలో జరిగిన మారణ హోహం యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్‌ నుంచి సముద్ర మార్గంలో ముంబయికి వచ్చిన కొంత మంది ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సాన్ని ఎవరూ మరిచిపోలేరు. ఉగ్రవాదుల దాడుల్లో ఎంతో మంది సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా మరణించారు. వారిలో ఒకరు మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌.
ప్రస్తుతం ఇయన జీవిత కథను ఆధారంగా చేసుకుని తెలుగులో ‘మేజర్‌’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గూడఛారి ఫేమ్‌ శశికిరణ్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు కూడా భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను జూలై2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే నేడు (మార్చి 15న) మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘మేజర్‌’ చిత్ర యూనిట్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఆ అప్‌డేట్‌ ఏంటన్న దానిపై మాత్రం చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వలేదు. ట్రైలర్‌ విడుదల చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరో అడివి శేషు మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇందులో శేషు అచ్చంగా మేజర్‌ సందీప్‌ను పోలిఉండడం అభిమానులను ఆకట్టుకుంది.

Major Update

 

Also Read: RRR Update: రామరాజు కోసం సీత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండొచ్చు.. కానీ సీత కోసం మీ ఎదురుచూపులు మాత్రం..

South Indian Heroine : అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న దక్షిణాది స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో గుర్తుపట్టగలరా..!

ఈ మూవీ కోసం మొదటి సారి డైలాగ్స్ బట్టీపట్టాల్సి వచ్చింది.. ఆసక్తికర విషయాలను పంచుకున్న సీనియర్ హీరోయిన్..