Adivi Sesh’s Major : యంగ్ హీరో అడివి శేష్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు – హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ తోపాటు మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మహేష్ ఈ వీడియోను షేర్ చేసి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ”మేజర్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు అడివి శేష్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.
#MAJOR.. In cinemas, Feb 11 2022 🙂https://t.co/ngTqFzEP3S@adivisesh @sonypicsindia @GMBents @AplusSMovies @SashiTikka #MajorOnFeb11
— Mahesh Babu (@urstrulyMahesh) November 3, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :