Aditi Rao Hydari: ఆ మెసేజ్‌లు చేసింది నేను కాదు.. హీరోయిన్ అదితి రావు హైదరీ.. అసలేం జరిగిందంటే..

హీరోయిన్ అదితి రావు హైదరీ పేరు, ఫొటో వినియోగిస్తూ ఓ వ్యక్తి ఫోటోగ్రాఫర్లను మోసం చేస్తున్నాడని.. అలాంటి పేక్ అకౌంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్ చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Aditi Rao Hydari: ఆ మెసేజ్‌లు చేసింది నేను కాదు.. హీరోయిన్ అదితి రావు హైదరీ.. అసలేం జరిగిందంటే..
Aditi Rao

Updated on: Nov 16, 2025 | 6:20 PM

హీరోయిన్ అదితి రావు హైదరీ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలు తగ్గిపోవడంతో హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు తన పేరుతో ఓ వ్యక్తి ఫొటోగ్రాఫర్స్‌ని మోసం చేస్తున్నాడని తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది. ఈ విషయం తన దృష్టికి వచ్చిందంటూ క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేస్తూ తన అభిమానులను, ఫోటోగ్రాఫర్లను హెచ్చరించింది.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

అదితి ఇన్ స్టాలో “నా పేరుతో ఎవరో ఓ వ్యక్తి ఫొటోషూట్స్ కోసం పలువురు ఫొటోగ్రాఫర్స్‌కి వాట్సాప్‌లో మెసేజులు చేస్తున్నాడు. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ మెసేజ్ చేసింది నేను కాదు. నేను ఎలాంటి మెసేజ్ చేయను. నాకు వ్యక్తిగత ఫోన్ నంబర్ ఏం లేదు. కేవలం నా టీమ్ ద్వారా నేను సంప్రదిస్తాను. కాబట్టి ఆ నంబర్ నుంచి మెసేజులు ఏమైనా వస్తే దయచేసి స్పందించకండి” అంటూ పోస్ట్ చేసింది అదితి. అలాగే అతడి ఫోన్ నంబర్ సైతం షేర్ చేసింది. అదితి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అదితి చివరిసారిగా సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ సిరీస్‌లో కనిపించింది . ఆ తర్వాత ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

Follow Us