Adipurush Update: ‘ఆదిపురుష్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. మోషన్ క్యాప్చర్ పనులు షురూ..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ నుంచి అప్‌డేట్ వచ్చింది. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న
Adipurush Update: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ నుంచి అప్‌డేట్ వచ్చింది. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా షురూ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ మంగళవారం ఎర్లీ మార్నింగ్ వెల్లడించారు. మోషన్ క్యాప్చర్ బృందంతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు. ‘‘మోషన్ క్యాప్చర్ స్టార్టయ్యింది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’’ అని ప్రభాస్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి హాలీవుడ్ మూవీలతో పాటు రజినీ నటించిన ‘రోబో’, ‘కొచ్చాడియన్’ సినిమాలకూ ఈ ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. మనుషులకి మోషన్ క్యాప్చర్ సూట్ వేసి, వారి బాడీ నిండా సెన్సార్లను అటాచ్ చేస్తారు. వాళ్లతో యాక్టింగ్ చేయించి ఆ మోషన్‌ను కంప్యూటర్‌లో రికార్డ్ చేస్తారు. ఆ మోషన్‌ను 3డి యానిమేషన్ క్యారెక్టర్లకు అప్లై చేస్తారు. ఫిబ్రవరి 2 నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.
View this post on Instagram