
మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆదిపురుష్ సినిమా. రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ రాముడిగా కనిపించనున్నారు. తొలిసారిగా పౌరాణిక చిత్రంలో ప్రభాస్ నటిస్తుండడంతో ఆదిపురుష్ చూసేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ ఈ సినిమా మరింత అంచనాలను పెంచేశాయి. జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ మినహా.. ఇప్పటివరకు చిత్రయూనిట్ మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నది లేదు. కానీ ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో రోజుకో రూమర్ నెట్టింట వైరలవుతుంది. ఇప్పటికే పలు విషయాలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఇక తాజాగా హనుమంతుడి పక్క సీటు కోసం పోటీ… భారీ ధరకు విక్రయిస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి.
రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఓ సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఓ సీటు కేటాయిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో హనుమ సీటు పక్కనే కూర్చోవాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఆ సీటుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. హనుమ కోసం ఖాళీగా ఉంచిన సీటు పక్కనే ఉన్న సీట్లను భారీ ధరకు అమ్ముతున్నారనే ప్రచారం నడిచింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్.
“ఆదిపురుష్ టికెట్స్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. హనుమంతుడి పక్క సీటు టికెట్ ను భారీ ధరకు అమ్ముతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అన్నీ సీట్ల ధరకే ఆ టికెట్ కూడా అమ్ముతున్నారు. దానికి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇలాంటి రూమర్స్ సృష్టించకండి ” అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తుండగా.. టీసిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
#JaiShriRam #AdipurushOnJune16th https://t.co/7cXtLMwxfp
— #Adipurush ?? (@rajeshnair06) June 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.