రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టే.. ఈ మూవీ టీం చెబుతున్నట్టే.. రెండు వేల కోట్ల కలెక్షన్స్ పక్కాగా.. వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్ మాత్రమే కాదు.. అంతకు మించేలా ఇండియన్ సినిమాస్ పై ఓ నయా రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. జెస్ట్ రిలీజ్‌కు ముందే 500 కోట్ల బడ్జెట్లో దాదాపు 432 కోట్లను అప్పుడే కమాయించేసి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఇండియన్ సినిమాస్ ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఆదిపురుష్.. అప్పుడే తన కలెక్షన్ల ఖాతా ఓపెన్ చేసింది. దాదాపు 500కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్ రైట్స్ అండ్ నాన్ థియేటర్స్ రైట్స్ రూపంలో.. దాదాపు 432 కోట్లకు పైగా వసూలు చేసిందనే న్యూస్ బీ టౌన్ నుంచి లీకైంది.
అంతేకాదు.. తెలగు టూ స్టేట్స్లో నూ ప్రభాస్ ఆదిపురుష్ తన కలెక్షన్స్ ఖాతా తెరిచిందనే టాక్ ఉంది. ప్రభాస్‌కున్న స్టార్ క్రేజ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో.. థియేటర్ రైట్స్ రూపంలో దాదాపు 170కోట్లు వచ్చేలా చేసుకుందట ఆదిపురుష్. ఇక ఇప్పుడిదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆదిపురుష్ బాహుబలి రికార్డు బద్దలు కొట్టడం ఖాయమనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది.