Adipurush: మొదలైన ఆదిపురుష్‌ సందడి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్‌.. భారీగా ఎగబడ్డ అభిమానులు.

తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ సందడి మొదలైంది. ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది...

Adipurush: మొదలైన ఆదిపురుష్‌ సందడి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్‌.. భారీగా ఎగబడ్డ అభిమానులు.
Prabhas

Edited By:

Updated on: Jun 06, 2023 | 6:22 PM

తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ సందడి మొదలైంది. ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ఉదయం హీరో ప్రభాస్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర యూనిట్‌తో సహా.. సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.

ప్రభాస్‌ను చూసేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహా ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో భక్తులను పోలీసులు విజిలెన్స్‌ అదుపు చేయలేకపోయింది. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను ఆలయం ముందు నుంచి రాంభాఘీచ గేట్ వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు. అనంతరం అక్కడి నుంచి ప్రభాస్‌ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు. ఇక ప్రభాస్‌ బస చేసిన గెస్ట్‌ వద్ద కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

గెస్ట్ హౌజ్‌ చుట్టుపక్కల భక్తుల కోలాహలం నెలకొంది. దర్శన సమయంలో ప్రభాస్‌ వెంట టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తనయుడు ఉన్నారు. మరికాసేపట్లో తిరుపతి వెళ్లనున్న చిత్ర యూనిట్ సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్‌ ఈవెంట్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం టీవీ9లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..