Adipurush: ఆదిపురుష్ మేకర్స్ కీలక నిర్ణయం.. ఆ పాత్ర కోసం భారీ మార్పులు.. అదనంగా రూ.30 కోట్లు ఖర్చు ?..

|

Nov 17, 2022 | 9:45 AM

ప్రభాస్ లుక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు ఈ మూవీ టీజర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రాముడి పాత్రతోపాటు.. రావణుడు.. హనుమంతుడు

Adipurush: ఆదిపురుష్ మేకర్స్ కీలక నిర్ణయం.. ఆ పాత్ర కోసం భారీ మార్పులు.. అదనంగా రూ.30 కోట్లు ఖర్చు ?..
Adipurush
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు టీజర్ ద్వారా గట్టి షాక్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ లుక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు ఈ మూవీ టీజర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రాముడి పాత్రతోపాటు.. రావణుడు.. హనుమంతుడు పాత్రల గెటప్స్ పై ప్రేక్షకులు మండిపడ్డారు. దీంతో నెట్టింట దారుణంగా ట్రోలింగ్స్ నడిచాయి. అంతేకాకుండా.. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ మూవీలో రాముడు.. రావణుడి పాత్రలు పూర్తిగా మార్చేశారని… ముఖ్యంగా రావణుడి పాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోలినట్లు ఉందని.. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఢిల్లీలో పిటిషన్ ధాఖలు చేశారు. దీంతో ప్రభాస్‏తోపాటు.. డైరెక్టర్.. చిత్రయూనిట్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ క్రమంలో ఆదిపురుష్ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ ఓంరౌత్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. టీజర్ పై ఏర్పడిన ట్రోలింగ్ నేపథ్యంలో సినిమాలు భారీగానే మార్పులు చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో సమచారం. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇందులో సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్న రావణుడి లుక్ పూర్తిగా మార్చనున్నారట. అందులో అతడికి గడ్డం, మీసాలను వీఎఫ్ఎక్స్ ద్వారా తొలగించాలని భావిస్తున్నారట. ఈటీమ్స్ నివేదిక ప్రకారం.. సైఫ్ లుక్ పై మరింత ఫోకస్ పెట్టారట. అతడి రూపాన్ని డిజిటల్ గా మార్చనున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమాలో కేవలం సైఫ్ లుక్ మార్చేందుకే దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేయనున్నారట. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. కృతి సనన్ సీతగా కనిపించనుంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ వీఎప్ఎక్స్ మార్పుల దృష్ట్యా ఈ చిత్రాన్ని జూన్ 16కు వాయిదా వేశారు.