Adipurush: ఆదిపురుష్ 9వ రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

మొదటివారం భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం... కొద్దిరోజులుగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఫస్ట్ నుంచి కోట్లలో కలెక్షన్స్ రాగా.. ఆతర్వాత 7వ రోజు లక్షల్లోకి పడిపోయింది. ఇక ఆ తర్వాత 8వ రోజు కేవలం 65 లక్షలు మాత్రమే రాబట్టింది. దీంతో ఆదిపురుష్ సినిమాపై మరోసారి సందేహం కలిగించింది. అయితే 9వ రోజు మరోసారి ఆకస్మాత్తుగా కలెక్షన్స్ పెరిగిపోయాయి.

Adipurush: ఆదిపురుష్ 9వ రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..
ఇప్పటివరకు రూ. 400 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో ఆదిపురుష్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి.

Updated on: Jun 25, 2023 | 3:22 PM

బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే కలెక్షన్స్‏లో సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే దాదాపు రూ.145 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఫస్ట్ త్రీ డేస్ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఊహించనిస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే డైరెక్టర్ ఓంరౌత్ చేసిన పొరపాట్లు కారణంగా చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీప్రియులు. అయితే మొదటివారం భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం… కొద్దిరోజులుగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఫస్ట్ నుంచి కోట్లలో కలెక్షన్స్ రాగా.. ఆతర్వాత 7వ రోజు లక్షల్లోకి పడిపోయింది. ఇక ఆ తర్వాత 8వ రోజు కేవలం 65 లక్షలు మాత్రమే రాబట్టింది. దీంతో ఆదిపురుష్ సినిమాపై మరోసారి సందేహం కలిగించింది. అయితే 9వ రోజు మరోసారి ఆకస్మాత్తుగా కలెక్షన్స్ పెరిగిపోయాయి.

9వ రోజు అన్ని భాషల్లో కలిపి మొత్తం రూ.5.25 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే శనివారం, ఆదివారం కావడంతో కలెక్షన్స్ ఎక్కువగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారం మళ్లీ వసూళ్లు తగ్గే ఛాన్స్ లేకపోలేదు. తొమ్మిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 77 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్.. 123 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటకలో 11.96 కోట్లు.. తమిళనాడులో 2.30 కోట్లు షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో 23.95 కోట్లు షేర్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా 9 రోజుల్లో 182.82 కోట్ల షేర్ కలెక్షన్స్.. 369.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమా నిర్మాణానికి పెట్టిన బడ్జెట్ చూసుకుంటే.. ఇంకా ఈ సినిమా 59 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాలి. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది టీసిరీస్. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటించారు.