Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్.. అడవి తల్లి మాట రిలీజ్ ఎప్పుడంటే..

|

Dec 03, 2021 | 7:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న

Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్.. అడవి తల్లి మాట రిలీజ్ ఎప్పుడంటే..
Bheemla Nayak
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించాయి. భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

నిజానికి ఈ పాటను నవంబర్ 30న విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో వాయిదా వేశారు. తాజాగా భీమ్లా నాయక్ నాలుగవ పాట అడవి తల్లి మాటను డిసెంబర్ 4న ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: PushpaTrailer Tease: ట్రైలర్‏కు ముందు పుష్పరాజ్ టీజ్.. ఆకట్టుకుంటోన్న పుష్ప లెటేస్ట్ వీడియో..

Kethika Sharma: నటిని కావాలనుకున్నాను.. కానీ ఏలా అయ్యానో నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Talasani Srinivas Yadav: థియేటర్లు మూసివేయడం లేదు.. ప్రచారాలను నమ్మొద్దు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..