Chiranjeevi: మెగాస్టార్‌ లాంటి మంచి మనసు అందరికీ ఉండాలి.. చిరంజీవి చెప్పిన ఆ మాటలే నాకు అవార్డులు: వరలక్ష్మీ

గతేడాది వరలక్ష్మి తెలుగులో నటించిన వీరసింహారెడ్డి, కోట బొమ్మాలి పీఎస్‌ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ఇందులో హీరో తేజా సజ్జాకి అక్క పాత్ర (అంజమ్మ)లో నటించిందీ అందాల తార. కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ కనిపించింది.

Chiranjeevi: మెగాస్టార్‌ లాంటి మంచి మనసు అందరికీ ఉండాలి.. చిరంజీవి చెప్పిన ఆ మాటలే నాకు అవార్డులు: వరలక్ష్మీ
Varalakshmi Sarathkumar, Chiranjeevi

Updated on: Jan 12, 2024 | 10:44 AM

పేరుకు తమిళ నటి అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది వరలక్ష్మీ శరత్ కుమార్‌. కమర్షియల్‌ సినిమాల కంటే సబ్జెక్ట్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యన తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. గతేడాది వరలక్ష్మి తెలుగులో నటించిన వీరసింహారెడ్డి, కోట బొమ్మాలి పీఎస్‌ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ఇందులో హీరో తేజా సజ్జాకి అక్క పాత్ర (అంజమ్మ)లో నటించిందీ అందాల తార. కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ కనిపించింది. ఇటీవల హనుమాన్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన వరలక్ష్మి తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. ‘హనుమాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి సార్‌ నా పని, నటన గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. నీలాంటి ట్యాలెంట్‌ ఉన్న నటీమణులు తెలుగు చిత్రపరిశ్రమలో ఉండాలి. హైదరాబాద్‌లోనే ఉండు’ అని చెప్పారు’

‘ చిరంజీవి చెప్పిన మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. ఇన్నాళ్ల నా కష్టానికి ఒక అవార్డు వచ్చిందని సంతోషంగా అనిపించింది. సహ నటీనటుల గురించి అలా మాట్లాడాలంటే ఎంతో మంచి మనసుండాలి. హనమాన్‌ ప్రీ రిలీజ్‌ వేడుక అయిన తర్వాత కృతజ్ఞతలు చెబుతూ ఆయనకు మెసేజ్‌ చేశాను’ అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక వరలక్ష్మి తర్వాతి సినిమాల విషయానికొస్తే.. కన్నడ సూపర్‌ స్టార్ కిచ్చా సుదీప్‌ తో మ్యాక్స్‌, ధనుష్‌ తో కలిసి ‘ఢీ 50 సినిమాల్లో నటిస్తోందీ ట్యాలెంటెడ్‌ నటి. అలాగే మరికొన్ని తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

సంబరాల్లో హనుమాన్ చిత్ర బృందం

వరలక్ష్మి డ్యాన్స్..

హనుమాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.