
కెరీర్ ప్రారంభంలో పలు కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే కెరీర్ గాడి తప్పింది. సినిమా అవకాశాలు దూరమయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత సమస్యలు చుట్టు ముట్టాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తీవ్ర ఆటు పోటులు ఎదుర్కొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ మూడు విడాకులతోనే ముగిశాయి.కేవలం పెళ్లిళ్లే కాదు ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుందీ అందాల తార. అంతే కాదు తన తండ్రే తనను మోసం చేశాడని.. ఇంట్లో నుంచి గెంటేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
వనిత విజయ్ కుమార్ ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నటిగా కంటే వివాదాలతోనే ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అయ్యింది. దేవి సినిమాతో వనిత విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. వనిత విజయ్ కుమార్ 1995లో తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. 2021లో వనిత అధికారికంగా చెన్నైలో వనిత విజయకుమార్ స్టైలింగ్ పేరుతో తన సొంత బట్టల దుకాణాన్ని ప్రారంభించింది . ఆమె పార్ట్ టైమ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా..
నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన వనిత విజయ్ కుమార్ ఎక్కువగా వివాదాల్లో నిలిచింది. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది ఈ అమ్మడు. అందరితోనూ విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. గతంలో ఈ అమ్మడు తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా తనకు రానివాళ్లేదు అని తెలిపింది. రెండవ భార్యగా తన తల్లికి విజయ్ కుమార్ అస్సలు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదని తెలిపింది. ఆమె చనిపోయిన తర్వాత తన పిల్లలకు రావాల్సిన ఆస్తిని రానివ్వకుండా మోసం చేశాడని ఇంట్లో నుంచి గెంటేశారు అని తెలిపింది వనిత.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి