Bigg Boss 7: ఎంట్రీతోనే స్పెషల్ అట్రాక్షన్.. బిగ్‏బాస్ ఇంట్లో అందరి చూపు ఆమె పైనే..

ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచి ఆసక్తిని రేకెత్తించారు. అయితే గత సీజన్లకు భిన్నగా హోస్టింగ్ మార్చేశారు నాగ్. ఆట ఆడకుండా తిని కూర్చుంటూ.. ఫ్రెండ్స్ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్న ఒక్కొక్క కంటెస్టెంట్ ను ఉతికారేస్తున్నారు. మరోవైపు హిందీలోనూ బిగ్‏బాస్ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఆదివారం తమిళంలో బిగ్‏బాస్ సీజన్ 7 ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడ అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 1న స్టార్ట్ అయిన ఈషోలోకి భిన్నంగా తీసుకువచ్చారు.

Bigg Boss 7: ఎంట్రీతోనే స్పెషల్ అట్రాక్షన్.. బిగ్‏బాస్ ఇంట్లో అందరి చూపు ఆమె పైనే..
Bigg Boss 7

Updated on: Oct 02, 2023 | 2:22 PM

బిగ్‏బాస్ సీజన్ 7 తెలుగులో విజయవంతంగా రన్ అవుతుంది. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచి ఆసక్తిని రేకెత్తించారు. అయితే గత సీజన్లకు భిన్నగా హోస్టింగ్ మార్చేశారు నాగ్. ఆట ఆడకుండా తిని కూర్చుంటూ.. ఫ్రెండ్స్ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్న ఒక్కొక్క కంటెస్టెంట్ ను ఉతికారేస్తున్నారు. మరోవైపు హిందీలోనూ బిగ్‏బాస్ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఆదివారం తమిళంలో బిగ్‏బాస్ సీజన్ 7 ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడ అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 1న స్టార్ట్ అయిన ఈషోలోకి భిన్నంగా తీసుకువచ్చారు.

ఈసారి షోలోకి సీనియర్స్, జూనియర్స్ అడుగుపెట్టారు. అంతేకాకుండా ఈ సీజన్ లో రెండు హౌస్ లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈషోలో ఒక అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తనే జోవిక విజయ్ కుమార్. నటి వనితా విజయ్ కుమార్ కూతురు. జోవిక ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. తన తల్లి వనితా విజయ్ కుమార్ నడుపుతున్న వంటల యూట్యూబ్ ఛానల్ ను జోవికనే మ్యానేజ్ చేస్తుంది.

చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జోవిక మోడల్ గా కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదే సమయంలో తన తల్లి వనితా విజయ్ కుమార్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ను చూసుకుంటుంది. యూట్యూబ్ కుకింగ్ వీడియోలతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తుంది. ఇక ఇప్పుడు తన తల్లి మాదిరిగానే బిగ్‏బాస్ షోలోకి అడుగుపెట్టింది. హౌస్ లోకి అడుగుపెట్టగానే ఎమోషనల్ అయ్యింది. ఇంటి నుంచి వచ్చినప్పటికీ తన తల్లి తన తోడు ఉన్నారనే ఫీలింగ్ తె ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.