
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ అరుస్ట్ లుగా కొంతమంది హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ అమ్మడే వైష్ణవి చైతన్య. ఈ బ్యూటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఈ అమ్మడు నటించిన సాఫ్ట్ వేర్ డవలపర్స్ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బేబీ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అందమైన ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది బేబీ.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బేబీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎమోషనల్ అయ్యింది. సాయి రాజేశ్ తనకు నటిగా పునర్జన్మనిచ్చారంటూ ఎమోషనల్ అయ్యింది ఈ చిన్నది.
ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవ్వాలని వచ్చాను.. యూట్యూబ్ లో వీడియోలు చేసే సమయంలో నువ్వు హీరోయిన్ అవుతావా..? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారని తెలిపింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఓకే కానీ లీడ్ రోల్ చేయలేదు అని అన్నారు.. నాకు కూడా భయం వేసింది. నేను చేయలేనేమో అనికున్న కానీ దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో నాకు నమ్మకం వచ్చింది. ఆయన వల్లే నేను ఓ కొత్త ప్రపంచాన్ని చూశా అని కన్నీళ్లు పెట్టుకుంది వైష్ణవి చైతన్య.