
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం భాషలోల అనేక చిత్రాల్లో నటించిన త్రిష.. ప్రస్తుతం విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాల్లో నటిస్తుంది. కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రూపొందించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రిలీజ్ కానుంది. ఇందులో శింబు, త్రిష అభిరామి కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈఏడాదిలో విడుదల కానున్న త్రిష నాల్గవ సినిమా ఇది.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది త్రిష. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో త్రిష మాట్లాడుతూ.. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ తో నటించడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషను ఏ నటుడితో నటించాలనుకుంటున్నారని అడగ్గా.. త్రిష మాట్లాడుతూ.. “ఫహద్ ఫాసిల్ తో నటించాలని ఉంది. అతడు ఎలాంటి కథైనా.. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతమైన నటను చూపిస్తాడు. చాలా అద్భుతమైన నటుడు” అంటూ చెప్పుకొచ్చింది.
థగ్ లైఫ్ సినిమాతోపాటు విశ్వంభర చిత్రంలో నటిస్తుంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..