TVK Vijay- Trisha: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్.. ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే’ నంటూ..
టీవీకే అధినేత విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు రాహుల్ గాంధీతో పాటు ఎందరో రాజకీయ, సీనీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ హైలెట్ గా నిలిచింది మాత్రం హీరోయిన్ త్రిషనే. ట్రెడిషినల్ శారీలో వచ్చిన త్రిష ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా హీరో విజయ్ ఆదివారం (మే 10) ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అలాగే విజయ్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరితో పాటు స్టార్ హీరోయిన్ త్రిష ఈ వేడుకకు వచ్చింది. ఆకుపచ్చని చీరలో ఎంతో ట్రెడిషినల్ గా ముస్తాబైన త్రిష విజయ్ ప్రమాణస్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందిని చెప్పవచ్చు. ఇక ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ త్రిష బాగా ఎమోషనల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది త్రిష. ఇప్పుడది వైరల్ గా మారింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని ఈ పోస్టులో చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే’ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోల్లో త్రిష ఎంతో అందంగా కనిపించింది. లైట్ బ్లూ కలర్ పట్టు చీర, కొప్పులో మల్లెపూలు, ముఖంపై చిరునవ్వుతో త్రిష చాలా గ్లామరస్ గా ఉందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష పోస్ట్, ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేశారు. ‘గిల్లి’, ‘కురువి’, ‘లియో’ సినిమాల్లో వీరి జోడీకి మంచి పేరొచ్చింది. అయితే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఈ విడాకుల వెనక త్రిష కూడా ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఓ పెళ్లి వేడుకలో విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి. వీరిద్దరి పెళ్లి రూమర్లు తారా స్థాయికి వెళ్లాయి.
త్రిష షేర్ చేసిన పోస్ట్ ఇదే..
View this post on Instagram
కరుప్పు (వీరభద్రుడు) సినిమాలో సూర్య, త్రిష..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




