
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో పొడుగుకాళ్ల సుందరి టబు ఒకరు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా టబుకు మంచి క్రేజ్ ఉంది. విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన టబు కూలీ నేం1 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాగార్జున టబు క్రేమిస్ట్రీ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ లాంటి సినిమాలు చేసింది. ఇక తమిళ్ లో నటించిన కాదల్ దేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో ప్రేమ దేశం అనే టైటిల్ తో డబ్ అయ్యి. ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
చాలా కాలం తర్వాత ఇటీవలే టబు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టారు. మొన్నీమధ్య అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించారు. వయసు పెరుగుతున్నప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు టబు. గతంలో టబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. తన చిన్న తనంలోనే అమ్మ నాన్న విడిపోయారని తెలిపింది టబు.
తన సిస్టర్ అవసరమున్నప్పుడు తన తండ్రిని కలిసేది తాను మాత్రం ఎప్పుడు కలవలేదని అన్నారు టబు. ఆయనను కలవాలన్న ఆలోచన కూడా తనకు ఎప్పుడూ కలవలేదని అన్నారు. నేను ఎలా పెరిగానో నాకు తెలుసు.. అందులోనే నా సంతోషాన్ని వెతుక్కున్నానని అన్నారు. చిన్న తనంలో తన తండ్రితో కలిసి గడిపిన జ్ఞాపకాలు కూడా లేవని ఎనోషనల్ అయ్యారు టబు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.