కుమార్ వర్సెస్ కుమారి చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ సునైనా. అయితే ఈ మూవీ ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక ఇటీవల యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీకి మంచి స్పందన రావడమే కాకుండా.. సునైనాకు గుర్తింపు తీసుకువచ్చింది. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సునైనా తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఫాలోవర్లతో ముచ్చటించిన సునైనాను పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించాడు ఓ నెటిజన్. ఇందుకు ఆమె స్పందిస్తూ.. బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు అంటూ బదులిచ్చింది. ఆ తర్వాత.. మీ దృష్టిలో విజయానికి నిర్వచనం ఏమిటీ ? అని అడగ్గా.. మీ కోసం మీరు ఏమి కోరుకుంటున్నారో.. అదే మీకు సంతోషాన్నిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కష్ట సమయాల్లో ఏం చేస్తారని అడగ్గా.. ఈ మధ్యే చదవడం ప్రారంభించాను.. పుస్తక పఠనం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది అంటూ బదులిచ్చింది. తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఆమె నటించిన వండర్ ఉమెన్ ఓటీటీ ప్లాట్ ఫాంలో సోనీ లివ్ లో ప్రసారం కానుంది. అలాగే విశాల్ నటించిన లాఠీ చిత్రంలోనూ కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
Let me recover from the last heartbreak ? https://t.co/s8GC81iLpO
— SUNAINAA (@TheSunainaa) November 16, 2022
Yes yes, #meetcute… #laatti and #regina ❤️ https://t.co/ZWX6KlSEFw
— SUNAINAA (@TheSunainaa) November 16, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.