తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. అటు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది శ్రుతి. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్లో ఉంటుంది. తాజాగా అభిమానులతో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది శ్రుతి. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో స్పందించింది. అయితే ఈ చిట్ చాట్లో ఫాలోవర్స్ తిక్క ప్రశ్నలు వేయగా.. శ్రుతి గట్టిగానే కౌంటరిచ్చింది.
ఇందులో ఓ నెటిజన్ నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను ?.. అంటూ కామెంట్ చేయగా.. నేరుగా నో అంటూ చెప్పేసింది. ఆ తర్వాత మరో నెటిజన్ ఆర్ యూ వర్జిన్ ? అంటూ తిక్క ప్రశ్న వేశాడు. దీనికి శ్రుతి హాసన్ సరదాగా స్పందిస్తూ ముందు నువ్వు స్పెల్లింగ్ కరెక్ట్ రాయడం నేర్చుకో.. స్పెల్లింగ్ చూడూ అంటూ అతడికి కౌంటరిచ్చింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ శంతను హాజరికాతో కలిసి నెటిజన్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.