Shruti Haasan: అయ్యయ్యో.. శ్రుతి మరీ ఇలా అయితే ఎలా ?.. గులాబీని తినేస్తూ.. నెట్టింట రచ్చ..

|

Jul 21, 2022 | 6:04 PM

ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్.. వీడియోస్ షేర్ చేస్తున్న శ్రుతి.. అప్పుడప్పుడు ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది కూడా. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ క్రేజీ వీడియో షేర్ చేసింది.

Shruti Haasan: అయ్యయ్యో.. శ్రుతి మరీ ఇలా అయితే ఎలా ?.. గులాబీని తినేస్తూ.. నెట్టింట రచ్చ..
Shruti Haasan
Follow us on

విశ్వనటుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసింది శ్రుతి హాసన్ (Shruthi Haasan). మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవలే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ సరసన నటిస్తోన్న శ్రుతి.. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి మరోవైపు నెట్టింట కూడా రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్.. వీడియోస్ షేర్ చేస్తున్న శ్రుతి.. అప్పుడప్పుడు ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది కూడా. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ క్రేజీ వీడియో షేర్ చేసింది.

అందులో శ్రుతి హాసన్ పింక్ కలర్ డ్రెస్‍లో ఎంతో అందంగా కనిపిస్తూ.. మరో అందమైన గులాబీని తినేందుకు ప్రయత్నిస్తుంది. గులాబీని కొరికేసిన వెంటనే.. నవ్వుతూ పక్కకు వెళ్లిపోయింది. నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. నేను గులాబీని తిననందుకు చాలా సంతోషం. ఇదే కరెక్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రుతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న వాల్తేరు వీరయ్య మూవీలో.. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఎన్బీకే 107 సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్నో అంచనాల మధ్య ప్రభాస్ నటిస్తోన్న సలార్ మూవీలోనూ ఆద్య పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.