
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ అమ్మడు.. సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలో అందం, ప్రతిభతో కోట్లాది మంది అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా… ప్రభాస్ సరసన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ బాలీవుడ్ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. ఇదెలా ఉంటే.. తనకు ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ ఓ హీరోతో అస్సలు నటించను అంటుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
గతంలో శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. తనకు 16 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘లక్కీ నో టైమ్ ఫర్ లవ్’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. కానీ శ్రద్ధా ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. 2010లో, ఆమె తీన్ పట్టి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శ్రద్ధా మాట్లాడుతూ, “15-16 సంవత్సరాలు చాలా చిన్నవని నేను అనుకున్నాను. ఆ సమయంలో, నేను స్కూల్ పూర్తి చేసి కాలేజీకి వెళ్లాల్సి వచ్చింది. కానీ సల్మాన్ తో ఆఫర్ తిరస్కరించడం అంత సులభం కాదు కాబట్టి అది చాలా కష్టమైన నిర్ణయం” అని అన్నారు.
శ్రద్ధా మొదటి సినిమా ఫ్లాప్ అయింది, ఆ తర్వాత లవ్ కా ది ఎండ్ కూడా ఫ్లాప్ అయింది. కానీ ఆమె మూడవ సినిమా ఆషికి 2 సూపర్ హిట్ అయింది. శ్రద్ధా నటించిన ‘స్త్రీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది, అది ఆమె కెరీర్ లో ఒక మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె అనేక హిట్ చిత్రాలను ఇచ్చింది. శ్రద్ధా చివరిసారిగా గత సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం ‘స్త్రీ 2’ లో కనిపించింది. ప్రస్తుతం ఆమె లక్ష్మణ్ ఉత్తేకర్ దర్శకత్వంలో ‘ఈటా‘ సినిమాలో నటిస్తోంది.
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..