Tollywood: ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని హీరోయిన్‏గా తీసేసారు.. స్టార్ హీరో కూతురు సంచలన కామెంట్స్..

భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అయినవాళ్లకు సినిమా ఛాన్సులు క్యూ కడుతున్నాయి.

Tollywood: ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని హీరోయిన్‏గా తీసేసారు.. స్టార్ హీరో కూతురు సంచలన కామెంట్స్..
Shivatmika

Updated on: Jun 20, 2025 | 4:19 PM

సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ ఛాన్సులు కొట్టేసిన ముద్దుగుమ్మలు ఉన్నారు. నెట్టింట రీల్స్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన కొందరు అమ్మాయిలు కథానాయికగా అవకాశాలు అందుకున్న సందర్భాలు చూస్తున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న పలువురు యంగ్ స్టర్స్ నెట్టింట ఫేమస్ అయినవారే. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో పలు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ముద్దుగుమ్మ.. ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని తనను సినిమా నుంచి తీసేశారంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శివాత్మిక. ఒకప్పటి హీరో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు.

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన శివాత్మిక.. 2019లో దొరసాని సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దొరసాని తర్వాత తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. కొన్నాళ్లు టాలీవుడ్ నుంచి గ్యాప్ తీసుకున్న ఆమె.. 2022లో పంచతంత్రం, 2023లో రంగమార్తండ సినిమాల్లో మెరిసింది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. కొన్నాళ్లుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో సినిమాల నుంచి తప్పించారని.. మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఏ మేనేజర్, లేదా ఏజెంట్ ను కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్ ను పెంచుకోమంటున్నారని చెప్పుకొచ్చింది. కానీ తాను ఒక నటి అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివాత్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..