పట్టు పరికిణిలో అచ్చ తెలుగు ఆడపిల్ల.. కలువ కళ్లతో మాయ చేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. అందం.. అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గుర్తుపట్టండి. మీకోసం మరిన్ని క్లూస్.. ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇంకో విషయం.. ఈ చిన్నారి తల్లిదండ్రులు కూడా మన తెలుగు స్టార్ హీరోహీరోయిన్సే. తల్లిదండ్రుల బాటలోనే నటనను అందిపుచ్చుకుని వెండితెరపై రాణిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్ ఇండస్ట్రీలోనూ ఈ హీరోయిన్ హావా నడుస్తోంది. గుర్తుపట్టండి..
పైన ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. హీరోయిన్ శివాత్మిక.. అలనాటి హీరో రాజశేఖర్ గారలపట్టి. దొరసాని సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం రంగమార్తాండ, బ్రహ్మనందం పంచతంత్రం సినిమాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ హీరోయిన్ గా రాణిస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటునే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోస్.. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది.
Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..
Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..
Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..