Actress Shalu Chourasiya: శాలు చౌరాసియా పై దాడి కేసులో కీలక మలుపు.. పోలీసులు ఏం చెపుతున్నారంటే..

నటి శాలు చౌరాసియాపై దాడి కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుడు- నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.

Actress Shalu Chourasiya: శాలు చౌరాసియా పై దాడి కేసులో కీలక మలుపు.. పోలీసులు ఏం చెపుతున్నారంటే..
Chourasiya

Updated on: Nov 16, 2021 | 12:46 PM

Actress Shalu Chourasiya : నటి శాలు చౌరాసియాపై దాడి కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుడు- నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు. చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ.. భావిస్తున్నారు. దీంతో నిందితుడు ఒక సైకోగా అంచనా వేస్తున్నారు.. పోలీసులు. ఇదిలా ఉంటే ఇక స్టార్ బక్స్ ఎదురుగా.. ఉన్న ఘటనాస్థలి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనీ.. చెప్పుకొస్తున్నారు.. ఈఏరియాలో జాగింగ్ చేసే క్రమంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని వాకర్లను హెచ్చరిస్తున్నారు.

కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు. ఆమె ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్‌ పార్కుకు ఆనుకుని ఉన్న ట్రాక్‌లో వాకింగ్‌ చేసేందుకు వచ్చారు. గంటన్నర పాటు వాకింగ్‌ చేసి ఓ చోట నిలబడ్డారు. ఇంతలో ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె మూతికి గుడ్డ కట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఆమె కింద పడింది. దీంతో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. ఇక ఈ హగతన పై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పార్కు చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Liger: ఐరన్‌ మ్యాన్‌ను కలిసిన రౌడీ బాయ్‌.. మైక్‌ టైసన్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసిన విజయ్‌..

Bheemla Nayak: అదిరిపోయే పోస్టర్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన “భీమ్లానాయక్”.. ఫ్యాన్స్‌కు పండగే

Bigg Boss 5 Telugu: దశ మార్చిన బిగ్‌బాస్‌.. ఏకంగా చెర్రీ-శంకర్‌ల చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిన ఇద్దరు కంటెస్టెంట్లు.?