Sara Ali Khan : ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ..

|

Dec 13, 2021 | 7:36 AM

బాలీవుడ్‌లో స్టార్  కిడ్‌గా రాణిస్తున్న వారిలో సారి అలీఖాన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా కంటే తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.

Sara Ali Khan : ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ..
Sara
Follow us on

Sara Ali Khan : బాలీవుడ్‌లో స్టార్  కిడ్‌గా రాణిస్తున్న వారిలో సారి అలీఖాన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా కంటే తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సారా అందనికి అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రోజు రోజుకు ఈ అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ నిన్నటివరకు హిందీలోనే సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు సౌత్ పైన కన్నేసింది. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం ‘అత్రాంగి రే’ అనే సినిమా చేస్తుంది సారా. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ నెల్ 24న డిస్ని హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో సారా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆడక్తికర విషయాలను పంచుకుంది. ధనుష్ చాలా మంచి వ్యక్తి, గొప్ప నటుడు ఆయనతో నటించినందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది సారా. అలాగే విజయ్ దేవరకొండతో నటిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. విజయ్ తో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా.. ఆయన అందగాడు. అంటూ సమాధానం ఇచ్చింది. మరి ఈ అమ్మడు త్వరలోనే విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకుంటుందేమో చూడాలి. విజయ్ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి