
ప్రస్తుతం ఓ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఆమె నటించిన సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. అందులో ఆమె అందం, అభినయంతో కట్టిపడేసింది. దాదాపు తొమ్మిదేళ్లుగా సినీరంగంలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు కేవలం రెండు థియేట్రికల్ సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే సన్యా మల్హోత్రా. ఆమె నటించిన లేటేస్ట్ మూవీ మిసెస్. ప్రస్తుతం ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్న సినిమా ఇది. మలయాలంలో వచ్చిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకు హిందీ రీమేక్ ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ జీ5లో అందుబాటులో ఉంది. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ తోపాటు గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాగా మిసెస్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. పెళ్లి తర్వాత ఎంతోమంది అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.
ఈ సినిమా రిచా అనే మహిళ పాత్రలో సన్యా కనికిపించింది. అంతకు ముందు హిందీలో అనేక చిత్రాల్లో విభిన్నరకాల పాత్రలు పోషించారు. దంగల్, హిట్: ద ఫస్ట్ కేస్ (హిందీ), కాథల్, పాగ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఆమెకు హిందీలో ఇప్పటివరకు సరైన ఆఫర్స్ మాత్రం రాలేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్లు కావోస్తుంది. కానీ ఇప్పిటవరకు ఆమె నటించిన రెండు చిత్రాలు మాత్రమే థియేటర్లలో విడుదలయ్యాయి. ప్రస్తుతం కరణ్ జోహర్ కు సంబంధించిన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై ఓ సినిమాలో నటిస్తుంది. ఇందులో జాన్వీ కపూర్ ఫస్ట్ హీరోయిన్ కగా.. సన్యా సెకండ్ హీరోయిన్. దీంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. సన్యాను సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ చేయడమేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ మేకర్స్ సినిమాకు ఎవరు కావాలో వారిని పట్టించుకోదని.. దర్శకులకు ఆమె ఎందుకు కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అద్భుతమైన నటన.. డ్యాన్స్ తో సన్యా మెప్పిస్తుందని.. ఈ జనరేషన్ లో ఇలాంటి రెండు లక్షణాలున్నవారు దొరకడం చాలా కష్టమని పోస్టులు చేస్తున్నారు. సన్యా మల్హాత్రా మిసెస్ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈ చిత్రానికి అరతి కడవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిశాంత్ దహియా, కన్వల్ జిత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన