ఆ స్టార్ హీరో నాతో పిచ్చిగా ప్రవర్తించాడు.. షాకింగ్ విషయం చెప్పిన ప్రభాస్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు.

ఆ స్టార్ హీరో నాతో పిచ్చిగా ప్రవర్తించాడు.. షాకింగ్ విషయం చెప్పిన ప్రభాస్ హీరోయిన్
Actress

Updated on: Jan 17, 2025 | 4:14 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఊహించని విధంగా కొంతమంది నిర్మాతల మీద, హీరోల మీద కామెంట్స్ చేశారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. ఓ స్టార్ హీరో తనను ఇబ్బంది పెట్టాడు అని చెప్పింది ఆ హీరోయిన్. ఆ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరు. తనతో దురుసుగా ప్రవర్తించిన  హీరో ఎవరో తెలుసా.?

టాలీవుడ్ లో చాలా మంది భామలు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో సంజనా గల్రానీ ఒకరు. ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిష సిస్టర్ గా నటించి మెప్పించింది ఆ అమ్మడు. ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. సోగ్గాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన  ఈ అమ్మడు తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది. సినిమాలతో పాటు సంజన పలు టీవీ షోల్లోనూ పాల్గొంది. అలాగే బిగ్ బాస్ కన్నడలోనూ పాల్గొంది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో సంజన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసింది.  ఆ హీరో పేరు చెప్పను కానీ.. అతను ఓ కన్నడ హీరో. అతడికి కోపం ఎక్కువ. ఓ సినిమాలో సాంగ్ షూటింగ్‌లో నాకు టార్చర్ చూపించాడు. అంతకు ముందు ఆ హీరోకు డైరెక్టర్ కు మధ్య గొడవ జరిగింది. ఆ కోపంతోనే వచ్చి షూట్ చేశాడు. కెమెరా స్టార్ట్ అని చెప్పగానే ..  వచ్చి నా భుజాలను పట్టుకోని గట్టిగా నలిపేశాడు. ఆ నొప్పి భరించలేకపోయాను. ఇష్టమొచ్చినట్టు నలిపేస్తున్నావ్ ఏంటి అడిగితే.. మేనేజ్ చేసుకో అంటూ దురుసుగా మాట్లాడాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఓ అరగంట నీతో షూట్ చేయనన్నాను. నేను నీతో దెబ్బలు తినడానికి హీరోయిన్‌గా రాలేదు. నేనేమీ నీతో యాక్షన్ సీన్స్ చేయడానికి రాలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చింది సంజన

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి