
మనుషులకు ఎన్నో రకాల అలవాట్లు ఉంటాయి. ఇంకొంతమందికి చిత్రవిచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇక చేడు అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు.. ఎలాంటి చెడు అలవాటులేకుండా ఎవ్వరూ ఉండరు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు ఉన్న అలవాటు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హీరోయిన్ అయ్యుండి ఇలాంటి అలవాటు ఏంటి.? అని కొందరు అంటుంటే.. మరికొంతమంది ఇలాంటి అలవాటు ఉందని దైర్యంగా చెప్పడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె టాలీవుడ్ లో తోపు హీరోయిన్. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో.? ఆమెకు ఉన్న ఆ అలవాటు ఏంటో.? తెలుసా.?
ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్. ఈ ముద్దుగుమ్మ 2016లో మలయాళ చిత్రం పాప్‌కార్న్ తో హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది, ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో సరసన నటించింది. తెలుగులో ‘భీమ్లా నాయక్’ చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఆమె ఈ చిత్రంలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆతర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థతో ‘స్వయంభు’ అనే పాన్-ఇండియా చిత్రంలో, అలాగే ‘బింబిసార 2’ కూడా నటించే అవకాశం ఉంది, కానీ ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల సంయుక్త మాట్లాడుతూ.. తనకు మద్యంసేవించే అలవాటు ఉందని తెలిపింది. ఒత్తిడిగా అనిపించినప్పుడలా మద్యం తీసుకుంటాను అని తెలిపింది. రోజూ మద్యం తీసుకోను.. ఒత్తిడి, ఆందోళన అనిపించినప్పుడే కొద్దిగా తీసుకంటా అని తెలిపింది సంయుక్త. ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి