Post-COVID Weakness: సినీ నటి సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. గోవాలో ఆమె రోజువారీ జీవిత విశేషాలు, వంటలు, ఆరోగ్య చిట్కాలు వంటి విశేషాలన్నింటినీ సోషల్ మీడియాలో తన అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తుంటారు. ఒకానొక సమయంలో అతిగా బరువు పెరగడం.. మళ్లీ బరుతు తగ్గించుకున్న తీరును కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో సమీరా రెడ్డి కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. తనతో పాటు.. తన భర్త, పిల్లలు కూడా కోవిడ్ బారిన పడ్డారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే, కోవిడ్ నుంచి కోలుకునేందుకు సరైన జాగ్రత్తలు, మందులు తీసుకున్నామని, అంతకంటే ముఖ్యంగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా చాలా త్వరగా కోలుకున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
అలాగే.. కోవిడ్ తరువాత కూడా నీరసంగా ఉండే అవకాశం ఉందని, ఆ బలహీనతలను పొగొట్టే చిట్కాలను సమీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా్గ్రమ్ ద్వారా కోవిడ్ నుంచి కోలుకున్న వారు పాటించాల్సిన ఆహార నియమాలు, సూచనలు తెలుపుతూ పోస్ట్ చేసింది సమీరా.. మరి సమీరా చెప్పిన ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
సమీరారెడ్డి పోస్ట్-కోవిడ్ డైట్:
1. కొబ్బరి నీళ్ళు, ఉసిరికాయ రసం, నిమ్మరసం రోజూ త్రాగాలి.
2. డేట్స్, కాలా జామున్, నానబెట్టిన బాదం మరియు ఎండుద్రాక్ష, ఉసిరికాయలు, తాజా పండ్లు తినాలి.
3. భోజనంలో బెల్లం, నెయ్యి ఉండేలా చూసుకోవాలి.
4. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
5. పప్పుధాన్యాలు, కిచిడి, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తినాలి.
6. తగినంత నిద్రపోవాలి. ఫోన్, టీవీని చూడటం తగ్గించుకోవడం ఉత్తమం.
7. ఉదయం సమయంలో 15 నిమిషాల పాటు ఎండలో ఉండాలి.
8. వ్యాయామాలు అతిగా చేయకూడదు. దానికి బదులుగా నెమ్మదిగా నడవటం, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి.
9. అన్నింటికంటే ముఖ్యమైనది భావోద్వేగం. మీ భావాలను ఇతురులతో పంచుకోండి. ధైర్యంగా ఉండండి. ధైర్యమే కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.
10. ఆరోగ్యపరమైన సమస్యలుంటే మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అని సమీరా రెడ్డి ఇన్‌స్టాగ్రమ్‌లో పేర్కొన్నారు.
Sameera Reddy Instagram:
Also read: