సినీ సెలబ్రిటీలకు చదువు అబ్బదని, వాళ్లు స్కూల్ లేదా కాలేజ్ డ్రాప్ అవుట్లనే అపోహ ప్రచారంలో ఉంది. ఐతే మువీల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో గొప్పగా రాణించిన వాళ్లూ ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతారా ఇంగ్లిష్ లిటరేచర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు. నటి సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నటి తమన్నా ముంబైలోని నేషనల్ కాలేజీలో ఆర్ట్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. త్రిష బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తైన తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. ఈ కోవలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. స్కూల్ డేస్‌లో సామ్ టాలెంటెడ్ స్టూడెంట్. సమంత పదో తరగతి మార్కుల రిపోర్ట్ కార్డు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రిపోర్ట్ కార్డులో సమంత మార్కులు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. చెన్నైలోని సీఎస్‌ఐ సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో 2001-2002 పదో తరగతి హాఫ్ ఇయర్నీ ప్రోగ్రెస్ రిపోర్టు ఇది. దీనిలో సమంత మొత్తం 1000 మార్కులకు 887 మార్కులు సాధించారు.
మ్యాథమెటిక్స్‌లో 100కు 100 మార్కులు, ఇంగ్లిష్‌లో 90, ఫిజిక్స్‌లో 95, బోటనీలో 84, హిస్టరీలో 91, జాగ్రఫీలో 83 మార్కులు సాధించారు. సామ్ సినిమాల్లోనేకాకుండా చదువులోనూ నెంబర్ 1 అని మార్కుల రిపోర్టు చూస్తే తెలుస్తోంది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి సమంత 2007లో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా గతంలోనూ సామ్ టెన్త్ మార్క్స్ రిపోర్ట్ పలుమార్లు వైరల్ అయ్యింది.
టాపర్ ఎక్కడున్నా టాపరే. సామ్ తన లైఫ్‌లోని ప్రతి పాత్రలోనూ కూతురుగా, స్టూడెంట్‌గా, నటిగా, భార్యగా, కోడలుగా.. ఇలా తన రోల్‌ను పర్ఫెక్ట్‌గా చేస్తారనేదానికి ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అర్థం అవుతుంది. ఇక సినిమాల విషయాని కొస్తే.. సామ్ నటించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ మువీ బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాకపోయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. సీటాడెల్ అనే వెబ్‌సిరీస్, ఖుషీ మువీలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.