Samantha: ఇప్పటికీ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..

|

Aug 29, 2024 | 9:39 AM

ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ పై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణ కల్పించడం కోసం డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృష్టి చేస్తోందని ప్రశంసలు కురిపించింది.

Samantha: ఇప్పటికీ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..
Samantha
Follow us on

సినీరంగుల తెర చాటున రాక్షస చర్యలు అనేకం. మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ పై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణ కల్పించడం కోసం డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృష్టి చేస్తోందని ప్రశంసలు కురిపించింది.

“కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తు్న్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడంలేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు” అంటూ సమంత తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నారు.

మలయాళీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతోపాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.