Samantha: మళ్లీ సెలైన్‌ బాటిల్‌తో కనిపించిన సమంత.. ఫ్యాన్స్‌లో కంగారు.. ఏమైందంటే?

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో కనిపించిందీ అందాల తార. ఇది విడుదలై కూడా సుమారు రెండు సంవత్సరాలు గడుస్తోంది. అయితే ఇప్పుడు సామ్ నిర్మాతగా కూడా అదృష్టం పరీక్షించుకోనుంది.

Samantha: మళ్లీ సెలైన్‌ బాటిల్‌తో కనిపించిన సమంత.. ఫ్యాన్స్‌లో కంగారు.. ఏమైందంటే?
Samantha

Updated on: Mar 16, 2025 | 3:46 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ లపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గతేడాది ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది సామ్. దీంతో పాటు తన సొంత బ్యానర్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. కాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్‌ ట్రలాలా పేరుతో కొత్త ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన టీమ్ తో కలిసి సరదాగా గడిపిన క్షణాలను పంచుకుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ అందులోనే సమంత హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో కూడా ఉంది.

సామ్ షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు కంగారు పడుతున్నారు. సమంతకు ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనిపై సమంత కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాగా గతంలో మయోసైటిస్ తో తీవ్రంగా ఇబ్బంది పడింది సమంత. ఇందుకోసం విదేశాల్లోనూ ట్రీట్ మెంట్ తీసుకుంది. ఇప్పటికీ సామ్ మందులు తీసుకుంటుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

సెలైన్ బాటిల్ తో సమంత.. ఫొటోస్ ఇదిగో..

కాగా ఈ మధ్యన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తోందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడికెళ్లినా ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా సమంత కానీ, రాజ్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.

సమంత లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి