Samantha: ఆ సినిమాలో సమంత లుక్ బాలేదంటూ విమర్శలు.. నన్ను తీసేయాలని చెప్పారు.. మేకప్ ఆర్టిస్ట్ ఆవేదన..

|

Sep 05, 2024 | 3:24 PM

అయితే అందుకో కొందరు ఆ విమర్శలను లైట్ తీసుకుంటారు.. మరికొందరు తమ గురించి వచ్చే కామెంట్స్ చూసి ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా ఓ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది.

Samantha: ఆ సినిమాలో సమంత లుక్ బాలేదంటూ విమర్శలు.. నన్ను తీసేయాలని చెప్పారు.. మేకప్ ఆర్టిస్ట్ ఆవేదన..
Samantha
Follow us on

సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లుకు అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాల్లో స్టార్స్ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ చూసి అభిమానులు ఫిదా అవుతుంటారు. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి తమ లుక్ మార్చాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు పలు చిత్రాల్లో హీరోయిన్స్ లుక్స్ బాలేకపోతే ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆ హీరోయిన్ పర్సనల్ మేకప్ ఆర్టిస్టుపై దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే అందుకో కొందరు ఆ విమర్శలను లైట్ తీసుకుంటారు.. మరికొందరు తమ గురించి వచ్చే కామెంట్స్ చూసి ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా ఓ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది.

సాధన సింగ్.. పాపులర్ సెలబ్రెటీ మేకప్ ఆర్టిస్ట్. సినీరంగంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసింది. సమంతతోపాటు పలువురు అగ్ర కథానాయికలకు మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరించింది. అయితే ఓ సినిమా సమయంలో తనను తీవ్రంగా విమర్శించారట. ఈ మూవీలో సామ్ లుక్ బాలేదంటూ విమర్శలు వచ్చాయంట. దీంతో ఆమెను తొలగించాలని చాలా మంది విమర్శించారని చెప్పుకొచ్చింది. “జాను సినిమా సమయంలో సామ్ లుక్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. సమంతను ఇంత చెత్తగా మార్చారేంటీ అంటూ నెట్టింట ట్రోల్స్ చేశారు. నన్ను తొలగించాలని సమంతకు సలహా ఇచ్చారు. కానీ లుక్, బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోకుండా పనిని నమ్మారా సామ్. ఆ సినిమాలో తన లుక్ ఆమె మెచ్చారు. అందుకే నన్ను కంటిన్యూ చేశారు. కానీ నేను ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి తెలుగు రీమేక్ జాను. ఈ మూవీలో సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఈ మూవీ సమయంలో సామ్ లుక్, మేకప్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం సామ్ లుక్, యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.