
టాలెంటడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన జయం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నితిన్ ను హీరోగా పరిచయం అయిన ఈ ప్రేమ కథ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించగా సదా హీరోయిన్ గా చేశారు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇందులో రాను రాను అంటూనే చిన్నదో అనే పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా ఈ పాటు మారుమ్రోగుతోంది. ఈ సినిమాలో హీరో నితిన్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుపోతున్నాడు. అయితే సదా మాత్రం సినిమాలు తగ్గించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన సదా ఎన్నో సూపర్ హిట్స్ లో నటించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్ట్టుకుంటుంది ఈ భామ. తాజాగా రాను రాను అంటూ చిన్నదో సాంగ్ కు తన హుక్ స్టెప్ వేసి అదరగొట్టింది. చీరకట్టులో ఆ స్టెప్పేసి ఆకట్టుకుంది.
జయం సినిమాలో ఎలా ఉందో.. ఇప్పటికి కూడా అంతే అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.