The Raja Saab Pre Release Event: ప్రభాస్ ఇచ్చిన చీరతో.. ‘ది రాజా సాబ్’ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్.. వీడియో

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. శనివారం (డిసెంబర్ 27) నిర్వహించిన ఈ ఈవెంట్ కు చిత్ర బృందమంతా హాజరైంది. కాగా కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

The Raja Saab Pre Release Event: ప్రభాస్ ఇచ్చిన చీరతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్.. వీడియో
Prabhas The Raja Saab Pre Release Event

Updated on: Dec 28, 2025 | 6:30 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. హీరో ప్రభాస్ తో సహా చిత్ర బృందంమంతా ఈ వేడుకకు హాజరైంది. అలాగే ప్రభాస్ అభిమానులు కూడా భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ గురించి మాట్లాడారు. డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

‘ ప్రభాస్ గారి కోసం సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు కానుకగా ఇచ్చిన చీర కట్టుకొని ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాను’ అని రిద్ధి కుమార్ చెప్పగానే గ్రౌండ్ హోరెత్తిపోయింది. అభిమానులందరూ ప్రభాస్.. ప్రభాస్ అంటూ గట్టిగా కేకలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

మరో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ప్రభాస్ తో సినిమా చేయటం తన అదృష్టమని తెలిపారు. ప్రభాస్ తో ఉంటే ప్రతిరోజు పండగే అంటూ నిధి పేర్కొంది. ఇక మాళవిక మోహన్ అని మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను అలాంటిది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.