
టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో నటించకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల తార. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల కోసం తన వంతు మంచి పనులు చేస్తోంది. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ సమాజంలో జరుగుతోన్న కొన్ని ఆటవిక సంఘటనలపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె మూగ జీవుల గురించి ఎన్నో రకాల వీడియోలు, వార్తలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో నెటిజన్స్ ను రిక్వెస్ట్ చేసింది. దయచేసి సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసుకుంది. ఇంతకూ ఏమైందంటే..
రేణు దేశాయ్ హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించిన విషయం తెలిసిందే.. బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత రేణు దేశాయ్ జానీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత సినిమాలకు దూరమైన రేణు దేశాయ్.. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది.
ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఆమె ఇలా రాసుకొచ్చింది” విజయవాడలో ఉంటున్న నా మంచి ప్రజలారా ప్రతి ఒక్కరూ దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి. రవి గారికి విరాళం ఇవ్వండి.. మీరు నా ఎన్జీవో కి విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి జంతు సంఘానికి ఖచ్చితంగా విరాళం ఇవ్వండి” అంటూ దండం పెట్టే ఎమోజిని జోడించి రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలోనూ ఇలా ఆమె జంతువుల సంరక్షణ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి