Renu Desai: ‘హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి’.. సనాతన ధర్మంపై రేణూ దేశాయ్ సంచలన పోస్ట్

|

Nov 26, 2024 | 4:54 PM

సాధారణంగా మనకు తెలిసిన వారెవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ లేదా రిప్ అని సంతాపం ప్రకటిస్తాం. అయితే ఇలా చెప్పడం తప్పంటోంది ప్రముఖ నటి రేణూ దేశాయ్. ఇటీవల ఆమె తల్లి కన్నుమూసిన నేపథ్యంలో రేణూ దేశాయ్ ఒక సంచలన వీడియోను షేర్ చేసింది.

Renu Desai: హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి.. సనాతన ధర్మంపై రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
Actress Renu Desai
Follow us on

ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నమూయడంతో నటి కన్నీరుమున్నీరైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణూ దేశాయ్ తల్లికి నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో తన తల్లి చనిపోయిందన్న రేణూ దేశాయ్ పోస్ట్ కు చాలామంది రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్‌లు పెట్టారట. తన స్నేహితులు, సన్నిహితుల్లో కూడా చాలా మంది రిప్ అని సంతాపాన్ని ప్రకటించారట. అయితే అది చాలా తప్పు అంటోంది రేణూ దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ఆమె.. ‘ఎవరైనా హిందువులు చనిపోతే రిప్ అని చెప్పకండి. రిప్ అంటే.. ఆత్మకు విశ్రాంతి దొరకడం అని.. కానీ మన సనాతన హిందు ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.. దానికి విశ్రాంతి ఉండదు.. పుట్టడం, గిట్టడం అనేది నిరంతరం జరిగే ఓ సర్కిల్. అందుకే మనం ఎవరూ రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అనే పదాలు వాడొద్దు. వీటికి బదులు ఓం శాంతి, సద్గతి అని చెబితే బాగుంటుంది. సనాతన ధర్మం కూడా ఇదే చెబుతోంది’ అని రేణూ దేశాయ్ పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి

‘ఇటీవల నా తల్లి మరణించినప్పుడు, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది “ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని” లేదా కేవలం RIP అని సందేశం పంపడం ద్వారా తమ సంతాపాన్ని తెలియ జేశారు. అయితే నేను ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిట్ నుంచి RIP, సద్గతి మధ్య తేడాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని నేను నా సోషల్‌ ఫాలోవర్లతో పంచుకోవాలని అనిపించింది. అంతే కానీ ఎవరి నమ్మకాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు’ అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్.

రేణూ దేశాయ్ పోస్ట్..

ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ కు ఆమె కామెంట్ సెక్షన్ ను క్లోజ్ చేయడం గమనార్హం.

తల్లి మరణంపై రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.