Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ గురించి ఆమె పెట్టిన ప్రెస్ మీట్, అందులో ఆమె అగ్రెసివ్ గా మాట్లాడిన తీరు సినిమా ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో
Actress Renu Desai

Updated on: Jan 22, 2026 | 10:06 PM

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆతర్వాత దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆకట్టుకున్నారు. తన మల్టీ ట్యాలెంట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రేణూ దేశాయ్. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావులో ఓ విభిన్నమైన పాత్రలో రీఎంట్రీ ఇచ్చినా మళ్లీ కంటిన్యూ చేయలేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఆధ్యాత్మికత పరంగా, సామాజిక సేవ వైపు అడుగులు వేస్తున్నారు. వీటికి సంబంధించిన కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు.. మహిళలు, మూగజీవాల సమస్యలపై నిత్యం తన గళాన్ని వినిపించే రేణూ దేశాయ్ ఇటీవల వీధి కుక్కల అంశంపై ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే మోక్షం, పునర్జన్మ గురించి కూడా మాట్లాడింది. ఈ సందర్భంగా మరో లైఫ్, మరో జన్మంటూ ఉంటే ఏం చేద్దామనుకుంటున్నారు? అన్న యాంకర్ ప్రశ్నకు రేణూ దేశాయ్ ఇలా ఆన్సరిచ్చింది.

‘అమ్మో.. నాకు మరో జన్మ వద్దు. నాకు ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది అనే విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. ఈ జన్మలో ఉన్న అన్ని కర్మలు, అన్ని రుణానుబంధాలు సెట్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాను. అలాగే రావాల్సి ఉంటే తీసుకుంటాను. ఎవరినైనా నేను హర్ట్ చేసి ఉంటే, నన్ను కూడా హర్ట్ చేయొచ్చు. ఏదైనా సరే… అన్ని లెక్కలు ఈ జన్మలోనే తేల్చేసుకుంటాను. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు… మాట్లాడుతుండగానే హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చు’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

కాశీ క్షేత్రంలో నటి రేణూ దేశాయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.