Rashmika Mandanna: అందాన్ని కాపాడుకోవడానికి అదే సరైన మార్గం.. రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఛలో సినిమాతో హీరోయిన్ గా వచ్చిన రష్మిక ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించింది.

Rashmika Mandanna: అందాన్ని కాపాడుకోవడానికి అదే సరైన మార్గం.. రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
Rashmika Mandanna

Updated on: Jan 11, 2024 | 12:24 PM

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుంచి  వచ్చిన రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో సినిమాతో హీరోయిన్ గా వచ్చిన రష్మిక ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

రీసెంట్ గా యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బిజీగా మారిపోయింది రష్మిక మందన్న. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు తన ఫ్యాన్స్ కు గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసింది.

రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ చిన్నది. లేటెస్ట్ ఫొటోలతో పాటు తన సినిమా అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అమ్మాయిలు అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పింది రష్మిక మందన్న. తాజాగా తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే, ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫేస్ మాస్క్ తో ఓ ఫోటో షేర్ చేసింది.  అందరం పనిలో పడిపోయి బిజీగా ఉన్నప్పుడు.. కనీస నిద్ర కూడా లేకపోవడం.. ఎక్కువ ప్రయాణం చేయడంతో చర్మం దెబ్బ తింటుందని తెలిపింది. డెర్మటాలజిస్ట్ దగ్గరకు కూడా వెళ్లే సమయం ఉండదు. అప్పుడు ఫేస్‌ మాస్క్‌లు ఉపయోగించడం సరైన పని చెప్పుకొచ్చింది.

Rashmika

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.