Rashmika Mandanna: నేషనల్ క్రష్‏ను వరిస్తున్న క్రేజీ ఆఫర్స్.. మరో స్టార్ హీరో సరసన ఛాన్స్.. అక్కడ హిట్టు కొట్టినట్టే ?..

|

Oct 14, 2022 | 1:15 PM

అలాగే తమిళంలో విజయ్ దళపతి నటిస్తోన్న వరిసు సినిమాలో నటిస్తుంది. అయితే ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న రష్మికకు మరిన్ని ఆఫర్స్ తలుపుతడుతున్నాయి.

Rashmika Mandanna: నేషనల్ క్రష్‏ను వరిస్తున్న క్రేజీ ఆఫర్స్.. మరో స్టార్ హీరో సరసన ఛాన్స్.. అక్కడ హిట్టు కొట్టినట్టే ?..
Rashmika Mandanna
Follow us on

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంలో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. బాలీవుడ్ ఇండస్టరీలో వరుస ఆఫర్లు అందుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషలతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలను ఏలేస్తుంది రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హిందీలో గుడ్ బై చిత్రంతో ప్రేక్షకులను అలరించింది నేషనల్ క్రష్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం మిశ్రమ స్పందన లభించింది. ఇదే కాకుండా.. ప్రస్తుతం హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను, రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు త్వరలోలనే పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోననుంది. అలాగే తమిళంలో విజయ్ దళపతి నటిస్తోన్న వరిసు సినిమాలో నటిస్తుంది. అయితే ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న రష్మికకు మరిన్ని ఆఫర్స్ తలుపుతడుతున్నాయి.

కార్తి సినిమా సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అక్కడ ఈ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురైంది. ఇక ప్రస్తుతం రష్మిక ఆశలన్ని వరిసు సినిమాపైనే ఉన్నాయి. డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళంలో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తమిళ్ స్టార్ ధనుష్ కాంబోలో సార్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రష్మికను కథానాయికగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ద్విభాష చిత్రంగా వస్తోన్న ఈ మూవీలో ధనుష్ జోడిగా రష్మిక ఉంటే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి

అయితే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా రష్మికను ఆఫర్స్ మాత్రం ఎక్కువగానే వరిస్తున్నాయి. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. డైరెక్టర్ సుకుమార్…అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీలో గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఇక పుష్ప 2లోనూ రష్మిక పాత్ర సరికొత్తగా ఉండనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.