Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకెండ్ హీరోయిన్ గా కనిపించింది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలేవీ చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో రాశీకి చేదు అనుభవం ఎదురైంది.

Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
Actress Rashii Khanna

Updated on: Apr 19, 2026 | 8:49 AM

స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె కారవాన్ లో దొంగలు చొరబడ్డారు. హీరోయిన్ పర్స్ లో ఉన్న 50 వేల రూపాయలు కొట్టేసారు. రాశీ షూటింగ్ కి వెళ్లొచ్చే గ్యాప్ లో ఈ ఘటన జరిగింది. కారవాన్ లో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన రాశీఖన్నా మేనేజర్ కి చెప్పడంతో సెట్ లో ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉంటారని సెట్ ని లాక్ చేసి దొంగని వెతికారు. తీరా వెతికితే ఆ కారవాన్ డ్రైవరే రాశీఖన్నా పర్స్ నుంచి డబ్బులు కొట్టేసాడట. దీంతో ఆ డ్రైవర్ కి బుద్ది చెప్పి ఆ కారవాన్ సంస్థకు సమాచారం అందించి అతన్ని సెట్ లోంచి పంపించేసారట. సాధారణంగా హీరోయిన్స్ అంత డబ్బుని పర్స్ లో క్యారీ చేయరు. ఆ రోజు షూటింగ్ అయ్యాక ఏదో అవసరం ఉంది అని తెచ్చుకుందట. తీరా చూస్తే దొంగతనం జరిగింది. కానీ చివరకు దొంగని పట్టుకొని ఆ డబ్బులను రాశీఖన్నాకు తిరిగి ఇప్పించారు. కాగా ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సినిమా షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటని చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా గతేడాది తెలుసు కదా తెలుగు ఆడియెన్స్ న పలకరించింది రాశీ ఖన్నా. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్‌తో మన ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోందీ అందాల తార. ఇందులో అక్షయ్ కుమార్, విద్యా బాలన్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. దీంతో పాటు లుక్కే అనే ఓ వెబ్ సిరీస్ లోనూ కీలక పాత్రలో కనిపించనుంది రాశీ. ర్యాపర్ కింగ్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్న ఈ సిరీస్ లో రాశీ ఖన్నా, శివాంకిత్, లక్ష్య వీర్ శరణ్, పాలక్ తివారీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మే 08న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us