Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ రాశిఖన్నా. ఆ తర్వాత వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ మారింది ఈ బ్యూటీ. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఈ చిన్నది తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. నిజానికి బాలీవుడ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రారంభమై ఆ తర్వాత నేరుగా అవసరాల శ్రీనివాస్ అవకాశం ఇవ్వడంతో ఇక్కడ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గతంలో మారుతితో ప్రతిరోజు పండగే సినిమా చేసింది రాశి. అలాగే గోపీచంద్ తో కలిసి జిల్ సినిమాలో మెరిసింది.
గ్లామరస్ నాయికగా నటిగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్న రాశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మలయాళ సినిమా పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది… తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది. హిందీ సినిమా ఇప్పటికీ దాని స్థానం ఎక్కడుందో వెతికేందుకు ప్రయత్నిస్తోంది“ అని తెలిపింది రాశిఖన్నా. వాస్తవానికి మనదగ్గర సినిమాలు సూపర్ హిట్స్ అందుకుంటుంటే.. బాలీవుడ్ లో మాత్రం బడాహీరోలు నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్స్ అందుకుంటున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. ఆలాగే బాహుబలి – కేజీఎఫ్ – పుష్ప లాంటి చిత్రాలు సౌత్ నుంచి వెళ్లి హిందీలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇదే విషయాన్నీ రాశిఖన్నా చెప్పకనే చెప్పింది.
మరిన్ని ఇక్కడ చదవండి :