
కన్నడ భాష మూలాల గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రారంభోత్సవంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, ‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ ప్రకటనను చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కన్నడ అనుకూల సంస్థలు వ్యతిరేకించాయి. ఇప్పుడు, కమల్ హాసన్ కామెంట్స్ పై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసిన నటి రమ్య, ద్రావిడ భాషల మూలం చార్ట్‌ను అందులో షేర్ చేశారు. రమ్య పంచుకున్న పట్టిక ప్రకారం, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం తదితర భాషలు ద్రావిడ భాష నుంచి ఉద్భవించాయి. అంటే కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషలు ద్రావిడ భాష కిందకు వస్తాయని పేర్కొంటూ రమ్య ఒక సందేశాన్ని కూడా షేర్ చేసింది.
‘మన భాషలకు సారూప్యతలు ఉన్నాయి, కానీ ఏ భాష మరొకదాని కంటే గొప్పది కాదు. సంస్కృతాన్ని అన్ని భాషలకు తల్లిగా భావించే వారు ఇప్పటికీ ఉన్నారు. కానీ అది కూడా నిజం కాదు. ఎందుకంటే సంస్కృతం ఇండో-ఆర్యన్ భాష. కానీ మేము ద్రావిడులము. “ఇండో-ఆర్యన్లు ఇక్కడికి వలస రావడానికి చాలా కాలం ముందే మేము ఇక్కడ ఉన్నాం. కమల్ హాసన్ ఒక ఆవేశపూరిత ప్రకటన చేశారు. కానీ ఆ కారణంగానే ఆయన సినిమాను నిషేధించడం కొంచెం అతిగా అనిపించడం లేదా? మనమందరం కలిసి హిందీ భాషా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి, కానీ దానికి ముందు, మనం ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి’ అని రమ్య పేర్కొంది.
I think what @ikamalhaasan meant was Kannada, Tamil, Telugu and Malayalam are all Dravidian languages- we have shared linguistic ancestry and commonality. But to boycott is a bit much no? A faux pas is excusable. pic.twitter.com/3MNYCDo3Sn
— Ramya/Divya Spandana (@divyaspandana) May 29, 2025
/h3>
కమల్ హాసన్ ప్రకటనకు గురువారం (మే 29) సంబంధించి ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగింది. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు అనుమతించబోమని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న విడుదల కానుంది.
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.