AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rambha : ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది.. హీరోయిన్ రంభ..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రంభ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. ఇప్పుడిప్పుడే బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పుకొచ్చింది.

Rambha : ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది.. హీరోయిన్ రంభ..
Rambha
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2026 | 9:26 PM

Share

హీరోయిన్ రంభ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రంభ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో తన గ్లామర్, అద్భుతమైన నటనతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన కథానాయిక రంభ. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న రంభ.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమయ్యారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో రంభ తన సినీ ప్రయాణం, వివాహ జీవితం మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్‌లో దాదాపు అందరు అగ్ర నటులతో పనిచేశానని, తనకు ఏ ఒక్కరూ ప్రత్యేకంగా ఇష్టమైన వారని ఏమీ లేదని, అందరితో సమానంగా మరియు ఎంతో సంతోషంగా పనిచేశానని ఆమె పేర్కొన్నారు.

ఈ తరం స్టార్ హీరోలలో ఎవరితో నటించాలని ఉంది అనే ప్రశ్నకు రంభ ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లతో నటించాలని తనకు ఎప్పటి నుంచో బలమైన కోరిక ఉందని ఆమె వెల్లడించారు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, హ్యాండ్‌సమ్‌నెస్ అలాగే ప్రభాస్ ప్యాన్ ఇండియా ఇమేజ్, వారి అద్భుతమైన నటన తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. సరైన కథ , మంచి పాత్ర లభిస్తే వీరిద్దరితో స్క్రీన్ పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రంభ తెలిపారు.

ఒకవేళ రంభ మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు లేదా ప్రభాస్ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తే, అది వెండితెరపై ఒక అద్భుతమైన ఫీస్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. కోలీవుడ్ బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ప్రభాస్, మహేష్ బాబు ఫోటో..

Prabhas, Mahesh Babu

Prabhas, Mahesh Babu

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..