Rakul Preet Singh: ఎంతకు తెగించార్రా! వాట్సాప్‌లో స్టార్ హీరోయిన్ నెంబర్.. ఫ్యాన్స్‌కి రకుల్ రిక్వెస్ట్

గతంలో కాంతార 2 హీరోయిన్ రుక్మిణి వసంత్, అదితి రావు హైదరి వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి కేటుగాళ్ల బారిన పడ్డారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో చేరింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన ఈ అందాల తార సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు ఒక రిక్వెస్ట్ పెట్టింది.

Rakul Preet Singh: ఎంతకు తెగించార్రా! వాట్సాప్‌లో స్టార్ హీరోయిన్ నెంబర్.. ఫ్యాన్స్‌కి రకుల్ రిక్వెస్ట్
Rakul Preet Singh

Updated on: Nov 25, 2025 | 6:27 AM

సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. సెలబ్రిటీల పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తుల నెట్‌వర్క్ పెరుగుతోంది. ఇటీవల, చాలా మంది నటీమణులు దీనిపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన అభిమానులను హెచ్చరించింది. కొందరు కేటుగాళ్లు రకుల్ ప్రీత్ సింగ్ పేరును ఉపయోగించి సందేశాలు పంపుతున్నారు. ఇది రకుల్ ప్రీత్ సింగ్ దృష్టికి వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన ఆమె వాటి స్క్రీన్‌షాట్‌తో పాటు సోషల్ మీడియాలో దాని గురించి సమాచారం పంచుకుంది. 8111067586 మొబైల్ నంబర్ కు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను వాట్సాప్ డీపీలో పెట్టారు. బయో వివరాలలో ఆమె సినిమా పేర్లు కూడా రాశారు. ఈ నంబర్ రుకుల్ ప్రీత్ సింగ్ దే అని చెప్పుకుంటూ చాలా మందికి సందేశాలు పంపారు. దీనిని గమనించిన రకుల్ వెంటనె అలెర్ట్ అయ్యింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టింది.

‘హాయ్ ఫ్రెండ్స్.. ఎవరో నా పేరుతో ప్రజలకు వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. దయచేసి గమనించండి, ఇది నా నంబర్ కాదు. ఈ నంబర్ తో ఎవరూ ఛాటింగ్ చేయకండి.. దయచేసి దీన్ని బ్లాక్ చేయండి’ అని రకుల్ ప్రీత్ సింగ్ అందరినీ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్..

గతంలో హీరోయిన్ అదితి రావు హైదరి కూడా ఇలాంటి ఫేక్ ఐడీల బారిన పడింది. ‘ఎవరో నా పేరుతో వాట్సాప్ చేస్తున్నారు. వారు నా ఫోటోను ఉపయోగిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లకు సందేశాలు పంపుతున్నారు. ఫోటోషూట్‌ల గురించి ఆరా తీస్తున్నారు. నేను ఎవరికీ ఇలాంటి సందేశాలు పంపను. ప్రతిదీ నా బృందం ద్వారా వస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని అదితి రావు హైదరి హెచ్చరించింది.

‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలో నటించిన నటి రుక్మిణి వసంత్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 9445893273 నంబర్ నుంచి కొందరు చాలా మందికి కాల్ చేశారు. ఈ విషయం రుక్మిణి వసంత్ దృష్టికి వచ్చింది. ‘ఈ మొబైల్ నంబర్ నాది కాదు. దీని నుండి మీకు ఏదైనా సందేశం లేదా కాల్ వస్తే స్పందించకండి. అది నేను కాదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దయచేసి అలాంటి సందేశాలకు స్పందించవద్దు లేదా వారితో సంభాషించవద్దు’ అని రుక్మిణి వసంత్ తన ఫ్యాన్స్ ను అలెర్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.