
సాధారణంగా హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్, డేటింగ్ రూమర్స్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఆ విషయాలను ఖండించగా.. మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు పలువురు ముద్దుగుమ్మ తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఇటీవల ఫరియా అబ్దుల్లా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అతడు హిందూ అని చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్ దివ్య భారతి సైతం కాలేజీలో తన లవ్, బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా మరో హీరోయిన్ సైతం తన టాక్సిక్ రిలేషన్ షిప్ గురించి వెల్లడించింది. తన ప్రియుడి గురించి ఆమె చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆపై సీరియల్స్ చేసింది ప్రియా భవానీ శంకర్. నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన హాట్ స్పాట్ 2 సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె రిలేషన్ షిప్ గురించి పలు విషయాలు వైరల్ అయ్యాయి. తన ప్రియుడితో విడిపోయిందని రూమర్స్ రాగా.. అందులో వాస్తవం లేదంటూ ఆమె చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తన స్నేహితుడు రాజ్ వేల్ తో ప్రేమలో ఉంది ప్రియా భవానీ శంకర్.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియోలో ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ.. కాలేజీలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తెలిపింది. కానీ అతడు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడని.. విధేయత చూపించడానికి ఎక్కువకాలం రిలేషన్ షిప్ లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. టాక్సిక్ రిలేషన్ షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి ఆ బంధం నుంచి బయటకు రావాలని తెలిపింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..