Pranitha:వేడుకగా ప్రణీత కుమారుడి బారసాల.. ఎవ్వరూ ఊహించని పేరు పెట్టిన బాపు బొమ్మ.. వీడియో ఇదిగో

ప్రముఖ నటి ప్రణిత సుభాష్ , నితిన్ రాజు దంపతులకు గత ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డ పుట్టాడు. ఈ బుడ్డోడికి ఇప్పుడు నామకరణ మహోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం అందరూ ఫ్యాన్సీ పేర్ల వెంట పరుగెత్తుతుండగా, ప్రణీత మాత్రం తన కుమారుడికి ఓ డిఫరెంట్ పేరు పెట్టింది.

Pranitha:వేడుకగా ప్రణీత కుమారుడి బారసాల.. ఎవ్వరూ ఊహించని పేరు పెట్టిన బాపు బొమ్మ.. వీడియో ఇదిగో
Pranitha Subhash

Updated on: Apr 21, 2025 | 6:35 PM

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు అందమైన పేర్లు పెట్టాలని కోరుకుంటారు. ముఖ్యంగా ట్రెండీ నేమ్స్ నే తమ పిల్లలకు పెడుతున్నారు. అయితే బాపు బొమ్మ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది. ఆమె తమ కుమారుడికి జయ కృష్ణ అని పేరు పెట్టింది. మహాభారతానికి రథసారథిగా భావించే కృష్ణుడి పేరును తన బిడ్డకు పెట్టడానికి గల కారణాన్ని ప్రణీత ఇలా వివరించింది. ‘మా తాత పేరు బాలకృష్ణ.’ మా హాస్పిటల్ పేరు శ్రీ కృష్ణ. నా భర్త తండ్రి పేరు వాసుదేవ. ఇలా అందరి పేర్లు కలిసొచ్చేలా మా బిడ్డకు జై కృష్ణ అని పేరు పెట్టాం’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార. కాగా కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రణిత, వ్యాపారవేత్త నితిన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు అర్నా అని పేరు పెట్టారు. ఇక సెప్టెంబర్‌లో ప్రణీత ఒక మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇప్పుడు ఆ బుడ్డోడికి బారసాల నిర్వహించి జై కృష్ణ అని నామకరణం చేశారు.

ప్రణీత కుమారుడి నామకరణ మహోత్సవం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరయ్యారు. ప్రముఖ నటి రమ్య, పుష్ప ఫేమ్ డాలి ధనంజయ్ తో పాటు పలువురు కన్నడ సినీ ప్రముఖులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. అందరూ ప్రణీత కుమారుడిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రణీత కుమారుడి బారసాల వేడుకలో సినిమా తారలు.. వీడియో..

సిద్ధార్థ్ నటించిన  బావ సినిమాతో తెలుగు ఇండస్డ్రీకి పరిచయమైంది ప్రణీత.  ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక పెళ్లి, పిల్ల తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది అందాల తార. అయితే త్వరలోనే ఈ బ్యూటీ కూడా సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది.

కుమార్తె అర్నాతో ప్రణీత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.