Tollywood: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

టాలీవుడ్ నటి ప్రగతి తాను హీరోయిన్‌గా సినిమాలు మానేయడం వెనుక అసలు కారణాన్ని చెప్పింది. ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిస్తానని, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఇష్టమైన పనులే చేస్తానని తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

Tollywood: ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!
Actress Pragathi

Updated on: Jan 20, 2026 | 12:53 PM

టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదుర్కున్న సవాళ్లు, కష్టాల గురించి పంచుకుంది. ముఖ్యంగా ఒక వాన పాట సంఘటన కారణంగా తాను హీరోయిన్‌గా సినిమాలు ఎందుకు మానేశానో వివరించింది. హీరోయిన్‌గా తాను చేసిన చివరి చిత్రం సెట్‌లో ఒక వ్యక్తి తనతో అమర్యాదగా మాట్లాడారని, అది తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని ప్రగతి తెలిపింది. ఆ సంఘటన అనంతరం ‘ఇన్ని మాటలు పడి నేను ఎందుకు చేయాలి’ అని ఆలోచించి, నటనకు గుడ్ బై చెప్పానని ఆమె పేర్కొంది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

తన ఆత్మాభిమానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తానని నటి ప్రగతి స్పష్టం చేసింది. తాను ఎవరి జోలికి వెళ్లనని, అబద్ధాలు ఆడనని, నిజాయితీగా, క్రమశిక్షణతో వంద శాతం అంకితభావంతో పనిచేస్తానని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఎవరైనా తనను పరుషంగా మాట్లాడితే సహించనని ఆమె పేర్కొంది. సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఆర్థిక అవసరాల రీత్యా తాను తిరిగి పనిచేయాలని భావించానని తెలిపింది. అప్పుడు దూరదర్శన్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తిరిగి కెరీర్‌ను నిర్మించుకున్నానని వివరించింది.

ఇవి కూడా చదవండి

ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ, నటన తనకు ఏకైక ఆదాయ వనరు అని, ఎక్కువ పెట్టుబడులు పెట్టలేకపోయానని ప్రగతి అంగీకరించింది. ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలపాటు కూర్చొని పనిలేకుండా ఉండేంత కంఫర్ట్ జోన్‌లో తాను లేనని, అందరిలాగే అప్పులు, ఆర్థిక రొటేషన్లు ఉంటాయని తెలిపింది. అయినప్పటికీ, తనకు నచ్చిన చిత్రాలలో మాత్రమే పనిచేయడానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పింది. పవర్‌లిఫ్టింగ్‌ తన అభిరుచి మాత్రమేనని, దాని వల్ల ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవని, పైగా తానే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేసింది.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..