Poonam Kaur: వాళ్లిద్దరూ మహిళలను ఆయుధాలుగా వాడుకుంటారు.. సంచలన కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..

గత కొద్ది రోజులుగా హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. సమాజంలో నెలకొన్న పరిస్థితులపై... సినీ పరిశ్రమలో

Poonam Kaur: వాళ్లిద్దరూ మహిళలను ఆయుధాలుగా వాడుకుంటారు.. సంచలన కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..
Poonam Kaur

Updated on: Feb 24, 2022 | 6:32 PM

గత కొద్ది రోజులుగా హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. సమాజంలో నెలకొన్న పరిస్థితులపై… సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తుంటారు. ఆమె చేసే ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా.. ఆమె చేసిన ట్విట్స్ క్షణాల్లో డెలిట్ చేయడంతో నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఎప్పుడు పరోక్షంగా ట్వీట్ చేసే పూనమ్ కౌర్.. ఇప్పుడు నేరుగా ఓ డైరెక్టర్‎ను టార్గెట్ చేసి ట్వీట్ చేసింది. అతడు చేసిన ట్వీట్‏కు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది పూనమ్ కౌర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఎవరిని పూనమ్ టార్గెట్ చేసిందో తెలుసుకుందామా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఇందులో పవన్ కళ్యాణ్ జెంటిల్‏గా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ.. పవన్ స్పీచ్ వీడియోను షేర్ చేస్తూ.. నేను చూసిన స్పీచెస్‏లో పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒకటని కామెంట్స్ చేశారు. అయితే ఆర్జీవీ ట్వీట్‏కు పూనమ్ కౌర్ రిప్లై ఇచ్చింది.

ఒక దర్శకుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కామెంట్ చేస్తారు. మూలగా.. సైలెంట్‏గా ఉండిపోతారు.. మరో దర్శకుడు ఆయన్ని రాజకీయంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ట్విట్టర్‏లో నవ్వుతుంటాడు. ఇద్దరూ డబ్బులిచ్చి బాడుగకు తెచ్చుకోబడిన ఏజెంట్లే. వారు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటారు అంటూ ట్వీట్ చేసింది. పూనమ్ చేసి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె అన్నట్లుగా ఒక డైరెక్టర్ ఆర్జీవి అయితే మరో డైరెక్టర్ ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read: Hamsa Nandini: క్యాన్సర్‏తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..

Mahesh Babu: మహేష్‏తో తలపడనున్న తమిళ్ స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‏కు త్రివిక్రమ్ అదిరిపోయే ట్రీట్..

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..